30, అక్టోబర్ 2008, గురువారం

నవ్వి పోదురుగాని రండి !


నా బ్లాగ్ వెనుక కథ !
కొన్ని నెలలక్రితం బాబా ఫోన్ చేసి తను సాహితీ -యానాం అని ఓ బ్లాగ్ క్రియేట్ చేసినట్టు చెప్పి నన్నూ ఓ బ్లాగ్ క్రియేట్ చేసి కార్టూన్లు పోస్ట్ చెయ్యమని చెప్పినపుడు కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేని నాకు ఏం అర్థం కాలేదు.చాన్నాళ్ళతర్వాత హైద్రాబాద్ లో ఉంటున్న పెద్దమేనల్లుడిని సంప్రతిస్తే నేనొచ్చినపుడు క్రియేట్ చేస్తాలే అన్నాడు గానీ వాడికి రావడంకుదరలేదు. ఐర్లాండ్ లోఉన్న రెండో మేనల్లుడితో ఆన్ లైన్లో ఈ విషయం చెప్పినపుడు వాడు అదెంతపని అనడం లక్కీగా మా అబ్బాయి ఇంట్లోనే ఉండటం .. ఆన్ లైన్లో మా మేనల్లుడు డైరెక్ట్ చేస్తుంటే నేను తెల్ల మొహం వేస్కుని చూస్తుండగానే మావాడు మొత్తం మీద నాబ్లాగుని తెరమీదకు తెచ్చేసాడు.ఈవిధంగా నన్ను బ్లాగ్ లోకం లోకి తీస్కొచ్చిన బాబా కు మా మేనల్లుడికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండగలనా?ఎంత బిజీగా ఉన్నాసరే కార్టూన్లు పట్టికెళ్ళగానే ఠక్కున స్కాన్ చేసి ఇచ్చే భవానీ డిజిటల్ ఫోటో స్టూడియో అధినేత శ్రీ. పెద్ది రాజు ను మరువగలనా? తరచూ నాబ్లాగులోకి తొంగి చూస్తూ ఫక్కుమంటున్న మీ అందరికీ అభి వందనాలు తెలుపకుండా ఎలా వుండగలను?
చివరగా.. గంటలతరబడి కంప్యూటర్ తో సహవాసం చేస్తున్నా ఏమాత్రం ఉడుక్కోని నాశ్రీమతికి థాంక్స్ చెప్పకుండా వుండగలనా ..?

21 comments:

Unknown 30 అక్టోబర్, 2008 10:36 PMకి  

భగవాన్ రెడ్డి గారు బాగుంది మీ బ్లాగు నేపధ్యం.

నాగప్రసాద్ 30 అక్టోబర్, 2008 10:48 PMకి  

రోజూ మమ్మల్ని నవ్విస్తున్న మీకు, మేము కూడా థాంక్స్ చెప్పకుండా వుండగలమా?.

రిషి 30 అక్టోబర్, 2008 11:14 PMకి  

Well Done sir.

Shiva Bandaru 30 అక్టోబర్, 2008 11:44 PMకి  

బాగుంది మీ బ్లాగు నేపధ్యం

Unknown 31 అక్టోబర్, 2008 12:46 AMకి  

అదిరింది

రాధిక 31 అక్టోబర్, 2008 1:15 AMకి  
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాధిక 31 అక్టోబర్, 2008 1:17 AMకి  

బాబాగారు చాలా థాంక్స్ అండి.భగవాన్ గారూ మీబ్లాగు కార్టూనులతో కళ కళలాడుతూ వుండాలని కోరుకుంటున్నాను

అరుణాంక్ 31 అక్టోబర్, 2008 1:27 AMకి  

I used to go through weeklies or monthly magagines for cartoons.Every day i am checking your bog.continue with the same tempo.

ప్రపుల్ల చంద్ర 31 అక్టోబర్, 2008 6:20 AMకి  

కూడలి ఓపెన్ చెయ్యగానే మొదలు మీ బ్లాగే చదువుతాను :)...
బాబా గారికి కూడా ధన్యవాదాలు...

వర్మ 31 అక్టోబర్, 2008 8:33 AMకి  

పైన పైర్కొన్న వారందరికీ నా తరుపున కూడా ధన్యవాదాలు....

లక్ష్మి 31 అక్టోబర్, 2008 10:06 AMకి  

Keep writing Sir. I'll start my day with a smile when I see your cartoons.

అజ్ఞాత 31 అక్టోబర్, 2008 10:22 AMకి  

baba gaariki boldanni thaankulu

mee blog chaalaa baaguntundi

ప్రతాప్ 31 అక్టోబర్, 2008 10:45 AMకి  

అయితే బాబా గారే అన్నమాట నవ్వుల బాంబులను మా మీద వెయ్యమని మిమ్మల్ని ప్రయోగించింది.
మీకు కూడా కృతజ్ఞతలు.

అజ్ఞాత 31 అక్టోబర్, 2008 11:58 AMకి  

యు హేపీస్........ఐహేపీస్..................అల్ హేపీస్

శ్రీనివాస్ పప్పు 31 అక్టోబర్, 2008 12:19 PMకి  
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీనివాస్ పప్పు 31 అక్టోబర్, 2008 12:21 PMకి  

నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా..చచ్చినాక నవ్వలేవురా ఎందరేడ్చినా తిరిగిరావురా...బ్రతికిరావురా...
నవ్వించు తమ్ముడూ...నీ కార్టూన్ల విరితోటలో మమ్మల్ని విరజాజులై పరిమళించనీ...పరవశించిపోనీ...

MURALI 31 అక్టోబర్, 2008 3:31 PMకి  

మీ ప్రయాణం ఇలానే మూడు కార్టున్లు ఆరు కామెంట్లుగా సాగి పోవాలని కోరుకుంటూ....

కొత్త పాళీ 31 అక్టోబర్, 2008 4:34 PMకి  

మీ రాక ఎంతో సంతోషం సుమండీ!
ఈ కార్టూను చూసి పైకే నవ్వేశాను!!

జ్యోతి 1 నవంబర్, 2008 7:09 PMకి  

భగవాన్ గారు,
మేమందరం మా ఆలోచనలను రాతలలో పెట్టి బ్లాగుతుంటే, మీరు ఎంచక్కా బొమ్మలలో పెడుతున్నారు. చాలా బావుంది.

నాదో సలహా.. మీ కార్టూన్స్ కి తగినట్టుగా మీ బ్లాగు ముఖచిత్రం లేదు. దానిని మారిస్తే బావుంటుంది. ఏమంటారు? ఓకే అంటే నాకు మెయిల్ చేయండి. వివరాలు చెప్తాను.
jyothivalaboju@gmail.com

kRsNa 2 నవంబర్, 2008 8:35 PMకి  

ఈ టపా జొకులు అదిరిపోయాయండి. క్రాఫు జోకు నాకు సరిగ్గ సరిపోయింది.

shaneer babu 3 నవంబర్, 2008 6:32 PMకి  

స్పందించిన మీ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు...

  © Blogger template Cool by Ourblogtemplates.com 2008 Blog powered by JBM

Back to TOP